ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 ఎదుర్కొవడంలో వ్యాక్సిన్లు కీలకంగా వ్యవహరించాయి. టీకా వినియోగం పెరిగిన తర్వాత కేసులు తగ్గుమఖం పట్టాయి. దేశంలో ఇప్పటికే కోట్ల మంది టీకాను తీసుకున్నారు. అయితే కరోనా ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్ గుడ్ బై చెబుతున్నా.. టీకా వినియోగంపై ఇంకా ఎన్నో సందేహాలు ఉన్నాయి. టీకా తీసుకుంటే మందు తాగకూడదా…? గర్భిణులు టీకా వేయించుకోవచ్చా.. వ్యాక్సిన్ తీసుకుంటే నపుంసకత్వం వస్తుందా? లాంటి ఎన్నో సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా..
- వ్యాక్సిన్ తీసుకుంటే నపుంసకత్వం వస్తుందనే అభిప్రాయం కొంతమందిలో బలంగా ఉంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. కేవలం పుకార్లేనని ఇప్పటికే డాక్లరు తేల్చారు.
- రెండు డోసులు తీసుకున్నవాళ్లు సైతం కరోనా బారిన పడి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకుతుందా అనే అనుమానం చాలామందిలో ఉంది. అయితే వ్యాక్సినేషన్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాక్సిన్ తీసుకుంటే.. ఆ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్లు అంతగా ప్రభావం చూపవని డాక్టర్ల అభిప్రాయం.
- వ్యాక్సినేషన్ తర్వాత కొంతమందిలో రక్తం గడ్డకట్టిన విషయాలు సైతం వెలుగులోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్స్ లో చాలా తక్కువ మందికి మాత్రమే రక్తం గడ్డకడుతుందట. మంచినీటిని ఔషధాల రూపంలో శరీరంలోకి ఎక్కిస్తే, కొన్ని రకాల సమస్యలు వస్తాయి తప్ప… రక్తం గడ్డకట్టుట అనేది మన దేశంలో మాత్రమే చాలా అరుదు.
- వ్యాక్సినేషన్ తర్వాత మందు తాగకూడదు… చాలామంది చెప్తున్న మాటలివి. అయితే వ్యాక్సిన్ తర్వాత శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కొంత వరకు ప్రభావం చూపుతుంది. కొన్ని ప్రతిచర్యలు కూడా ఉంటాయి. అయితే అందరీ శరీరాలు ఒకేలా ఉండవు. కాబట్టి వ్యాక్సిన్ ప్రభావం తీవ్ర స్థాయిలో లేకుంటే.. 24 గంటల్లో మద్యం సేవించవచ్చు. మాంసం కూడా ఎప్పుడైనా తినొచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువేనని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.
- కరోనా విరుచుపడుతున్న వేళ.. వ్యాక్సిన్ అన్ని వయసులవాళ్లకు అవసరమే. ఇప్పటికే పెద్దలు, మహిళలు, యువకులు వ్యాక్సిన్ తీసుకున్నారు. చిన్నపిల్లలకు కూడా టీకా అవసరమే. త్వరలో అందబాటులోకి వస్తే.. ఎంచక్కా టీకా వేయించుకోవచ్చు. రుతుస్రావంలో సమయంలో కూడా యువతులు, ఆడవాళ్లు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇక కొవిడ్ సోకినవాళ్లు.. పూర్తిగా కోలుకున్న తర్వాత వైద్యులను సంప్రతించి వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.
- చాలామంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాకేం కాదులే.. అనే నిర్లక్ష్యం చాలామందిలో కనిపిస్తోంది. ఇది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. వ్యాక్సినేషన్ తర్వాత కూడా మాస్కులు, భౌతిక దూరం పాటించాల్సిందేనని తేల్చి చెప్తున్నారు.











