మొదటి నుంచి కూడా రవితేజ చాలా ఫాస్టు. కథ వినడం దగ్గర నుంచి ఆ ప్రాజెక్టు పట్టాలెక్కేవరకూ, అలా ఆ సినిమా సెట్స్ పై నుంచి థియేటర్స్ కి వచ్చేవరకూ ఆయన స్పీడ్ మామూలుగా ఉండదు. అందువల్లనే ఆయన చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేయగలిగాడు. అలాంటి రవితేజ .. దర్శకుడు త్రినాథరావు నక్కినతో కలిసి ఒక సినిమా చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందోనని అంతా అనుకున్నారు. కానీ నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయింది.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా ఉన్నట్టుగా కొంతసేపటి క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ .. ఏఏ ఆర్ట్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కెరియర్ పరంగా రవితేజకి ఇది 68వ సినిమా. రవితేజతో త్రినాథరావు చేస్తున్న తొలి సినిమా ఇది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి, కథ – స్క్రీన్ ప్లే కుమార్ బెజవాడ అందిస్తున్నాడు. త్వరలోనే నటీనటుల .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయనున్నట్టు చెబుతున్నారు.
ఈ ఏడాది ఆరంభంలోనే రవితేజ ‘క్రాక్’ సినిమాతో హిట్ కొట్టేసి, ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. ఇక తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసుకోవచ్చనే ధైర్యాన్ని పెంచేశాడు. అలాంటి రవితేజ ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఆ సినిమా అలా సెట్స్ పై పరుగులు తీస్తూ ఉండగానే, రవితేజ68వ సినిమాకి సైన్ చేశాడు. త్రినాథరావుకి మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసు .. అందువలన ఈ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Must Read ;- ‘క్రాక్’ హిందీ రీమేక్ లో ఆ ఇద్దరు స్టార్ హీరోల్లో ఒకరికి ఛాన్స్!
Mass Maharaja @RaviTeja_offl & Director #TrinadhaRaoNakkina are teaming up for a Mass Entertainer #𝐑𝐓𝟔𝟖
Story & Screenplay: @KumarBezwada @peoplemediafcy @AAArtsOfficial @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla
More details soon !! pic.twitter.com/tsMp72jJLm
— BARaju (@baraju_SuperHit) February 21, 2021