బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వ్యవసాయ చట్టాలతో రైతుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, ఈ విషయాన్ని రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పాలని సూచించారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తూ.. వారిని రెచ్చగొడుతున్నాయని, వారి బారి నుంచి రైతులను కాపాడాలని కోరారు. ఈ చట్టాల వల్ల గ్రామాల రూపురేఖలే మారిపోతాయని ప్రధాని అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి సాగు చట్టాల ఆవశ్యకతను వివరించాలని సూచించారు.
గత ఏడాది బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరించిన తరువాత కొత్తగా నియమితులైన పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, వివిధ విభాగాల అధ్యక్షులతో తొలిసారి ఈ సమావేశం నిర్వహించారు. తన రాజకీయ ప్రయాణం అడుగడుగునా ముళ్లబాట అని, తాను ఏనాడూ తన గురించి వ్యక్తిగతంగా ఆలోచించలేదని మోదీ తెలిపారు.
Must Read ;- వ్యవసాయాన్ని అమ్మేస్తున్నారు..