గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నిక జరగనుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ టి పార్థసారధి ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 11 న మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్ ఎన్నిక.. ఆపై డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది ఎన్నికల కమిషనర్ తెలిపారు.
ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మధ్యహ్నం 12:30 సమయంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపట్టనున్నట్లు పార్థసారథి తెలిపారు. ఏ కారణాల చేతనైన ఒకవేళ ఎన్నిక నిలుపుదల చేయాల్సి వస్తే.. తర్వాతి రోజు ఫిబ్రవరి 12 న మునుపు అనుకున్న పద్దతలోనే ఎన్నిక నిర్వహించబడుతుందని ఎన్నికల కమిషనర్ తెలిపారు.
Must Read ;- దేశంలోనే పిన్నవయస్కురాలైన మేయర్ ‘ఆర్యా రాజేంద్రన్’











