రాజకీయాల్లో రాణించడమంటే మాటలు కాదు.. ఎత్తులు పైఎత్తుల వ్యవహారం.. చిన్న ఉపాయం చాలా పైచేయి సాధించడానికి.. అలాగే చిన్న సంఘలన చాలు అధఃపాతాళానికి పడిపోవడానికి.. స్పష్టంగా చెప్పాలంటే వైకంఠపాళి లాంటిది రాజకీయం. అందలెక్కడానికి నిచ్చెనలెలా ఉంటాయో.. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కాటు వేసే కాలనాగులు ఉంటాయి. అటువంటి రాజకీయాల్లో గెలుపొందిన ఆడవాళ్లు మన దేశ చరిత్రలో వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అలాగనీ.. ఆడవాళ్లకు రాజీకీయం తగదని అనుకోకండి.. తన కనుసన్నల్లో రాష్ట్రాలను, దేశాలను, ప్రపంచాన్ని సైతం శాసించిన ఆడవాళ్లు లేకపోలేదు. అటువంటి రాజకీయాల్లో తొలి అడుగుతోనే చరిత్ర సృష్టించిందో 21 ఏళ్ల యువతి. మరి తను సాధించిన ఘనతేమిటో మనమూ తెలుసుకుందాం రండి..
21 ఏళ్లకే మేయర్.. ఎలా సాధ్యమైంది?
సాధారణంగా రాజకీయాన్ని ఎంచుకునే వారు యువతలో చాలా తక్కువ మంది ఉంటారు. అందునా అమ్మాయిలు.. ఎక్కువగా వారసత్వంగా వచ్చిన వారే ఉంటారు మన దేశంలో. తమంత తాము రాజకీయాల్లో ఎదిగిన ఆడవాళ్ల శాతం తక్కువనే చెప్పాలి. అటువంటి జాబితాలో ఆర్యా పేరుకు అత్యుత్తమ స్థానం లభిస్తుందనడంలో సందేహం లేదు. కాలేజీ రోజుల నుండే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచింది ఆర్యా. ప్రస్తుతం బిఎస్సీ చదువుతున్న ఆర్యా.. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ)లో కేరళ తరుపు నుండి మెంబర్ గా కొనసాగుతుంది ఆర్యా. అంతేకాదు, సిపిఐ(ఎం) కి సంబంధించిన విధ్యార్థుల విభాగంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది ఆర్యా.
అదే స్ఫూర్తితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..
ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటి వరకు పోటీ చేయకపోయినా.. కాలేజీ రాజకీయాల్లో అనుభవం, విధ్యార్థి పోరాటాల్లో పాల్గొనడం, ఎటువంటి విషయాన్నైనా ధైర్యంగా ప్రశ్నించే గుణం, ప్రస్తుత పరిస్థితుల గురించి అవగాహాన, విషయాన్ని విశ్లేషించగల తెలివి, అనర్గళంగా మాట్లాడగ లాఘవం.. ఇవన్నీ తనకు లాభించాయి. కేరళలోని సిపిఐ(ఎం) తరపున తిరువనంతపురంలోని ముదువన్‌ముక్కల్ వార్డు మెంబర్‌గా పోటీ చేసింది. తనకు ప్రత్యర్థిగా నిలబడ్డ మహిళ రాజకీయ ఉద్ధండురాలైనా గానీ, యువశక్తి ముందు నిలవలేకపోయింది. ఫలితం ఆర్యా వార్డు మెంబర్‌గా గెలించింది.
Must Read ;- అపర చాణక్యుడు.. మచ్చలేని నేత.. ‘నితీశ్’
మేయర్‌గా ఎలా ఎన్నికైంది?
కేరళలోని అధికార పార్టీ 941 స్థానాలకు గాను.. 516 స్థానాలను గెలుచుకుని అఖండ విజయం సాధించింది. కానీ మేయర్ పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రతిష్ఠంబన కొనసాగింది. ఎవరికి ఇవ్వాలో అర్థం కాక ప్రభుత్వం తలపట్టుకుంది. అదే సమయంలో పార్టీలో చాలామంది ఈ సారి యువతకు అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రతిపాదించడంతో ఎవరికి ఇవ్వాలనే దానిపై తిరిగి సమాలోచనలు మొదలయ్యాయి. అందులో భాగంగా 21 ఏళ్లకే, రాజకీయాల్లో అత్యంత అనుభవం కలిగిన ప్రత్యర్ధిని ఓడించి వార్డు మెంబర్‌గా ఆర్యా రాజేంద్రన్ వారి దృష్టిని ఆకర్షించింది. వెంటనే తన గురించి ఆరా తీసి.. తనని మేయర్‌గా ప్రకటించింది ప్రభుత్వం.
Must Read ;- గడువెంతో ఉంది.. గ్రేటర్ మేయర్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ