మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ మే 13న విడుదల కాబోతుండడంతో.. సినిమా చిత్రీకరణను వేగవంతం చేశారు. ఇక దీని తర్వాత చిరంజీవి నటించబోయే మరో యాక్షన్ మూవీ.. ‘లూసిఫర్’ మలయాళ సినిమాకి రీమేక్ వెర్షన్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సినిమాకి ఓ పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్టు ఓ కొత్త అప్ డేట్ వచ్చింది.
‘లూసిఫర్’ మలయాళ రీమేక్ లో చిరంజీవి నటిస్తున్నారు అని తెలియగానే.. రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చేశాయి. ముందుగా దీనికి ‘బైరెడ్డి’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖాయం చేయబోతున్నారంటూ.. వార్తలొచ్చాయి. ఆ తర్వాత ‘బిగ్ బ్రదర్’ అని, ‘బ్రహ్మరథం’ అని ఇలా రకరకాల పేర్లు వినిపించాయి. మళ్ళీ కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకి ‘రారాజు’ అనే టైటిల్ ఖాయం చేయబోతున్నారంటూ.. వినిపించింది. అయితే అదే సమయంలో .. దీనికి ‘కింగ్ మేకర్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని ఒక వార్త ప్రచురించింది లియో న్యూస్. ఇప్పుడు ఆ టైటిల్ గురించే ప్రధాన చర్చ జరుగుతుండడం విశేషంగా మారింది.
‘లూసిఫర్’ కథాంశం ప్రకారం .. ఇందులో హీరోకి, పోలిటిక్స్ కు ఎలాంటి సంబంధం ఉండదు. కాకపోతే.. ముఖ్యమంత్రి సీట్లో ఎవరు కూర్చోవాలో నిర్ణయించే పవర్ ఫుల్ పాత్ర. అందుకే దీనికి ‘కింగ్ మేకర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. అలాగే..ఇందులో పవర్ ఫుల్ సౌండింగ్ ఉంది కాబట్టి.. ఈ టైటిల్ చిరంజీవికి కూడా బాగా నచ్చిందట. ఇంకా.. దీని కోసం ‘అన్న’ అనే టైటిల్ ను కూడా ప్రయారిటీ లిస్ట్ లో ఉంచారట. కథ ప్రకారం ఆ టైటిల్ కూడా ఈ సినిమాకి యాప్టే. కాకపోతే.. అదే టైటిల్ తో గతంలో రాజశేఖర్ హీరోగానూ, దళపతి విజయ్ నటించిన ఓ తమిళ సినిమాను తెలుగులోకి ‘అన్న’ పేరుతోనే డబ్బింగ్ చేశారు. అందుకే దీనికి ‘అన్న’ అనే టైటిల్ ఖాయం చేయరని అనుకోవచ్చు. మరి మెగాస్టార్ నిజంగానే ‘కింగ్ మేకర్’ అవుతారేమో చూడాలి.
Must Read ;- ‘వకీల్ సాబ్’ వీక్షణకు మెగా సపరివార సమేతం