మెగాస్టార్ చిరంజీవితోనే కరోనా టెస్టింగ్ కిట్లు ఆడుకుంటే ఎలా? మొన్నామధ్య ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే సంగతి తెలిసిందే. ఆయన త్వరగా కోలుకోవాలని చాలా మంది ఆకాంక్షించారు. అయితే ఈరోజు ఆయన ఓ ట్వీట్ చేస్తూ తనకు పాజిటివ్ రిపోర్టు పొరపాటున వచ్చినట్టుగానే పేర్కొన్నారు. ఈరోజు టెస్ట్ చేయిస్తే నెగిటివ్ రిపోర్టు వచ్చిందట. చిరంజీవికి కరోనా పాజిటివ్ రిపోర్టు రావడంతో ఆయన కలిసిన సెలబ్రిటీలు, ఆయనను కలిసిన వ్యక్తులు ఎంతో కంగారు పడ్డారు.
గత నాలుగు రోజులుగా ఈ కరోనా రిపోర్టులు తనతో ఆడుకున్నాయని, కొంత గందరగోళానికి గురిచేశాయని చిరంజీవి పేర్కొన్నారు. రెండు రోజులుగా తనకు ఎక్కడా కరోనా లక్షణాలు కనిపించలేదని, దాంతో అపోలో వైద్యులను సంప్రదించానని ఆయన తెలిపారు. వారు సీటీ స్కాన్ చేసి టెస్టుల్లో ఎలాంటి ఆనవాళ్లూ లేవని ధ్రువీకరించారన్నారు. మరోచోట కూడా పరిశీలించదలుచుకుని టెనెట్ ల్యాబ్ లో మూడు రకాల కిట్స్ తో పరీక్షలు చేయించానని, అక్కడ కూడా నెగిటివ్ రిపోర్టు వచ్చిందని వివరించారు.
ఆదివారం తనకు పాజిటివ్ రిపోర్టు వచ్చిన చోట కూడా ఆర్.టి. పీసీఆర్ చేయించానని, అది కూడా నెగిటివ్ వచ్చిందన్నారు. కిట్స్ లలో లోపం వల్లే పాజిటివ్ రిపోర్టు వచ్చిందని వైద్యులు నిర్దారణకు వచ్చారని చెప్పారు. వీటన్నిటినీ పరిశీలిస్తే మెగాస్టార్ చిరంజీవికి కరోనా లేనట్లుగానే భావించాలి. ఓ మెగాస్టార్ కే తప్పుడు కిట్లతో చేస్తే సామాన్యులు ఎంతమంది ఇలాంటి కిట్లతో పరీక్షలు చేయించుకుని భయాందోళనలు చెందారోనని ఇప్పుడు అనుకోవలసి వస్తోంది.
A group of doctors did three different tests and concluded that I am Covid negative & that the earlier result was due to a faulty RT PCR kit. My heartfelt thanks for the concern, love shown by all of you during this time. Humbled ! 🙏❤️ pic.twitter.com/v8dwFvzznw
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 12, 2020











