మెగాస్టార్ మేనల్లుడు గనుక.. వైష్ణవ్ తేజ్ చాలా గ్రాండ్ గా డెబ్యూ మూవీ ప్లాన్ చేసుకున్నారు. మంచి సంస్థ ద్వారా ఎంట్రీ. భారీ బడ్జెట్. అంతా బాగానే ఉన్నాయి. కానీ సినిమా పూర్తి కావడానికి అనేకానేక రీషూట్లు అవసరమయ్యాయంటేనే ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఎంట్రీకి ఉపయోగపడిన మెగా ఇమేజి.. సినిమా రిలీజ్ కు మాత్రం ఉపయోగపడడం లేదు.
మెగా కాంపౌండ్ నుంచి లేటెస్ట్ గా ఆడియెన్స్ ముందుకు రావడానికి సిద్ధమైన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. మెగా స్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడిగా ఇండిస్ట్రీకి పరిచయం అవుతున్నాడు వైష్ణవ్. దీంతో ఈ మెగా హీరోని లాంచ్ చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ముందుకొచ్చారు. ఈ కలయికలో ‘ఉప్పెన’ అనే సినిమా రెడీ అయింది.
అనేక రీషూట్స్ తీసిన తరువాత సినిమాని ఓ కొలిక్కి తీసుకొచ్చి మైత్రీ వారు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే అనుకోకుండా కరోనా విజృభించి థియేటర్స్ మూసేయడంతో ఉప్పెన ల్యాబ్ లోనే ఉండిపోయింది.
సినిమాకు క్రేజ్ తీసుకొచ్చిన ఆడియోను జనాలు ఇపాటికే మర్చిపోయి ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాను డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేస్తే బెటర్ అనే ఆలోచనలో మైత్రీ వారు ఉన్నట్లుగా సమాచారం.
కానీ మైత్రీ వారు ఉప్పెన చిత్రాన్ని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేస్తే మాత్రం చాలా నష్టం భరించాల్సి వస్తుందని ట్రేడ్ ఎక్స్ పెర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఉప్పెన చిత్రానికి మైత్రీ వారు దాదాపుగా 25 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంత మొత్తాన్ని తిరిగి రాబట్టాలంటే ఓటిటి రిలీజ్ దారి సరైనది కాదు. ఎందుకంటే వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కావడంతో ఉప్పెన కి ప్రొడక్షన్ కాస్ట్ కంటే ఎక్కువ ఇచ్చి కొనుక్కోవడానికి ఓటిటిలు ముందుకు రావు, కనీసం ఈక్వెల్ ఎమోంట్ కూడా ఇవ్వవు. మరి ఈ నేపథ్యంలో ఉప్పెన టీమ్ బాక్సాఫీస్ గండం దాటాలంటే, థియేటర్స్ తెరిచే వరకు ఆగాల్సిందే.