ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని సీఎం జగన్మోహన్‌రెడ్డిని,ఆయనకు మద్థతు పలుకుతున్నమీడియాను బండబూతులు తిట్టారు.నమ్మకం కుదరడం లేదా?అవును కొడాలి నాని తిట్టింది నిజమే కాకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును టిట్టబోయి,పొరపాటున ప్రస్తుత సీఎం జగన్మోహన్‌రెడ్డిని బండ బూతులు తిట్టేశాడు.దీంతో ఆయన తిట్లదండకం వీడియో వైరల్‌లా మారింది.ఇంతకీ మంత్రి కొడాలి నాని సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఏమి తిట్టారో ఆయన మాటల్లోనే..
‘ముఖ్యమంత్రిగా కాకుండా ఒక బ్రోకర్‌గా’..
‘ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా డబ్బా ఛానళ్ల యాజమాన్యాల కోసం,ఈ బోకు టీవీల పేపర్ల యాజమాన్యం కోసం,వాళ్ల దయాదాక్షిణ్యాల కోసం,వాళ్లకి ఊడిగం చేస్తూ,బ్రోకర్ పనులు చేస్తూ ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక బ్రోకర్‌గా,వాళ్ల యొక్క సంకనాకినటువంటి జగన్’….అంతే అప్పటికి మంత్రిగారు సృహలోకి వచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.సీఎం జగన్మోహన్‌రెడ్డిని బండబూతులు తిట్టిన మంత్రి కొడాలి నానీ అంటూ సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్‌గా మారిపోయాయి.అయితే ఆయన మనుసులో మాట బయటకు వచ్చిందని కొందరు ట్రోల్ చేస్తున్నారు.ఎప్పటి నుంచో సీఎం జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి కొడాలి నాని రగిలిపోతున్నాడని,మంత్రి వర్గ విస్తరణ జరిగితే ముందుగా ఊడేది కొడాలి నానీ పదవేనని సెటైర్లు వేస్తున్నారు.ఏది ఏమైనా అంతగా తిట్టాలనుకుంటే కొంచెం నిదానంగా ఆలోచించి తిట్టాలి.. అంతేకాని మైకు దొరికింది గదా అని నోటికి ఏది వస్తే అది తిడితే ఇదిగో ఇలాగే ఉంటుంది మరి.











