చంద్రబాబునాయుడు ఐదేళ్ల పదవీ కాలంలో రూ.3.5 లక్షల కోట్లు తెచ్చి ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టాడని పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును మించిన అవినీతి చక్రవర్తి మరొకరు లేరని ఆయన విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్‌ను జనం ఓడించారని వారిని చంద్రబాబు బూతులు తిడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని ఆయన దుయ్యబట్టారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తేవడం నేర్పిందే చంద్రబాబు అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు.
ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..
చంద్రబాబునాయుడు జగన్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ పరిపాలనకు జగన్ వారసుడని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబును నిమ్మగడ్డ రమేష్ కూడా కాపాడలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా కాలంలో వ్యాపారాలు మూతపడి రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిపోయినా, పేదల ప్రజలకు ఒక్కపూటైనా తిండి పెట్టేందుకే రూ.90 వేల కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు మాదిరి అప్పులు చేసి షోకులు చేయలేదని కొడాలి నాని చంద్రబాబుపై విచురుకుపడ్డారు.
Must Read ;- ఎన్వీ రమణకు లైన్ క్లియర్.. జగన్ ఫిర్యాదును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు











