భద్రత పేరుతో ఆనందయ్యను మళ్లీ నిర్బంధించే కుట్ర చేస్తున్నారని,దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.కృష్ణపట్నంలో ఉచితంగా కరోనా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్యను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వేధిస్తోందని ఆయన ఆరోపించారు.ఆనందయ్యకు ఏదైనా జరిగితే వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.వారం రోజుల పాటు ఆనందయ్యను నిర్బంధించిన పోలీసులు శుక్రవారం ఇంటికి పంపించి,మళ్లీ ఎమ్మెల్యే ఆదేశాలతో నిర్బంధించే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు.భద్రత నెపంతో ఆనందయ్యను అదుపులోకి తీసుకుని మందు తయారు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు.
Must Read ;- ఆనందయ్య మందు.. చర్చలు ఆపి తేల్చండి మహాప్రభో











