మీడియాకు మరో మసాలా దొరికింది.యూట్యూబ్ వ్యూస్ పెంచుకోవడానికి ఓ పసరు సబ్జెక్ట్ దొరికింది.జనానికి మాత్రం ఈ టెర్రిఫిక్ సిట్యుయేషన్‌లో అదొక ఆశాకిరణంలా కనపడుతోంది. కార్పొరేట్ ఆస్పత్రులు,కంపెనీలకు మాత్రం అది వారి పాలిట మరో కరోనాలా అనిపిస్తోంది.ఇంతకీ అది జనానికి అందుతుందా.. అందదా అనేది మాత్రం ఇంకా గాలిలోనే ఉంది.ఆనందయ్య.. ఇప్పుఢు ఈ పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.కరోనా కన్నా.. ఆనందయ్య మందు మీదే ఎక్కువగా చర్చ జరుగుతున్నది.ఎవరి వాదన వారు వినిపిస్తున్నారే గాని…అది వాడినవారితో మాట్లాడించడం గాని (ఒకటి రెండు వీడియోలు సరిపోవు)ఆనందయ్య గారితో వివరణ ఇప్పించడం గాని ఎవరూ చేయలేకపోతున్నారు.అది కరోనాకు మందుగా పని చేస్తుందో లేదో ఎవరూ తేల్చలేకపోతున్నారు.అది నాటు మందు కావడంతో ప్రభుత్వం కూడా తొందరపడకూడదని ఆచి తూచి అడుగులు వేస్తున్నది.సోషల్ మీడియా మాత్రం మోత మోగిస్తోంది.
వాడేవన్నీ ప్రకృతి నుంచి వచ్చినవే..
ఆనందయ్య తన మందులో వాడేవన్నీ ప్రకృతి నుంచి వచ్చినవే.ఏదీ హానికరమైంది కాదు. అవన్నీ ఏదో ఒక జబ్బుకు ఆయుర్వేదంలో వాడేవే.అవి ఇమ్యూనిటీని పెంచేవే అనడంలో కూడా ఎవరికీ సందేహం లేదు.ఎటొచ్చీ కరోనాకు విరుగుడుగా పని చేస్తుందా లేదా అన్నదే ప్రశ్న. దీనిపైనే ఇప్పుడు వాదోపవాదాలు నడుస్తున్నాయి.అలోపతిలో సైతం ఫలానా మందు కరోనాకు పని చేస్తుందని ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు.రెమిడెసివర్ వాడితే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతున్నాయి..కాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.కొందరు తట్టుకోలేక చనిపోతున్నారు.ఇక వేరే మందు ఏదీ చెప్పుకోదగినది లేనే లేదు.
Must Read ;- ఆనందయ్య మందు ప్రభావం.. ఆశ్చర్యపోయిన టీడీపీ బృందం

స్ట్రాంగ్‌గా కనపడుతున్న వారు సైతం..
నిన్న మొన్నటి వరకు స్ట్రాంగ్‌గా కనపడుతున్న మనుషులు సైతం పిట్టల్లా రాలిపోతుంటే..జనం భయం భయంగా కాలం గడుపుతున్నారు.పైకి ఎంత చెప్పుకున్నా..ఎన్ని చెప్పుకున్నా లోలోపల కరోనా భయం పీడిస్తూనే ఉంది.అమ్మో మనకే వస్తే మనం బతుకుతామా…అన్ని లక్షలు ఖర్చు పెట్టగలమా… వెళితే ఏ ఆస్పత్రికి వెళ్లాలి అనుకుంటూ..అమ్మో రాకపోతేనే మంచిదని అనుకోని మనిషి లేడు.ఇంత భయంలో ఉన్నవారికి ఆనందయ్య మందు అమృతంలా కనపడింది.అది పని చేస్తే..హమ్మయ్య మనం బతికిపోయినట్లే అనుకోనివారు లేరు.
మీడియాలో అదే చర్చ
మీడియా, సోషల్ మీడియాలో దాని గురించి వచ్చిన రోజు నుంచి ఇదే చర్చ.ఇప్పటికే ఆయన వేలమందికి మందు ఇచ్చాడు.తీసుకున్నవారిలో చాలామంది ఆ మందు పని చేసిందనే నమ్ముతున్నారు.గతంలో సైతం కొంతమంది మల్టీ విటమిన్,ఇతరాలు ఓ కోర్సులా ఇచ్చి వాడమన్నారు.అవి వాడి… కరోనా రానివారు ఆ మందు పని చేసిందని భావిస్తున్నారు.అది వాడినా కరోనా వచ్చినవారు..అది పని చేయలేదని అనుకుంటున్నారు.అంతెందుకు వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నవారికి సైతం కరోనా వస్తోంది.
అన్నిటికన్నాజనాన్ని అటెన్షన్లోకి తెస్తున్న విషయం ఒక్కటే…అది ఆనందయ్య మందు ఉచితం. అవును లక్షలు పోసినా ప్రాణాలు నిలబెట్టుకోలేని ఈ పరిస్ధితుల్లో ఉచితంగా ఇచ్చే మందు బతికిస్తుంది అంటే దాని కోసం పరుగులు పెట్టకుండా ఎలా ఉంటారు?
ఆనందయ్య మందుపై సందేహాలు లేకుండా త్వరగా తేల్చి..అది పని చేస్తుందా లేదా తర్వాత…హానికరం కాదని తేల్చారు కదా..అందరికీ అందించే ఏర్పాటు చేయొచ్చు కదా అనేది ఎక్కువమంది వేస్తున్నప్రశ్న.అందుకనే ప్రభుత్వాలు త్వరగా దీనిపై తేల్చాలని అందరూ కోరుతున్నారు.అలా కాకుండా దానిని కనుమరుగు చేసే ప్రయత్నం జరిగితే…కార్పొరేట్ మెడికిల్ మాఫియానే గెలిచిందని అనుకోవాల్సి ఉంటుందనే కామెంట్లు వస్తున్నాయి.
Also Read ;- ఆనందయ్య మందుపై వైసీపీ దందా.. వంట వాళ్లతో పెద్ద ఎత్తున తయారీ










