తాజాగా ఆమె కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీతక్క హైదరాబాద్ లోని ఇందిరాపార్ వద్దు ఆమరణ దీక్ష కు దిగారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చెల్లించిన బిల్లులను సీఎం సహాయ నిధి కింద బాధిత కుటుంబాలకు తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని సీఎం కేసీఆర్‌ను కోరుతూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ సోమవారం ట్వీట్ చేశారు. ఇందిరా పార్కు వద్ద సీతక్క దీక్ష చేస్తున్న ఫొటోను పోస్టు చేశారు.
బ్యానర్ల నీడలోనే దీక్ష
సీతక్క దీక్షకు అనుమతి లేదనే కారణంతో పోలీసులు దీక్షా స్థలంలో టెంట్ వేసేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో జెండాలు, బ్యానర్ల నీడలోనే సీతక్క దీక్ష కొనసాగించారు. రెండురోజులుగా దీక్ష చేస్తుండటంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. బీపీ బాగా డౌన్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. అయినా కూడా ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నిస్తున్నారు.











