తెలంగాణలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తుండటంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు ఆ మహామ్మారిన బారిన పడుతున్నారు.తాజాగా తెలంగాణలో మరో ఎమ్మెల్సీకి కరోనా సోకింది.హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.నాతో కొన్ని రోజులుగా కలిసిన వారు అందరూ కరోనా టెస్ట్ చేపించుకోవాలని,హోమ్ ఐసోలేసన్ లో ఉండాలని కోరారు. ఈ నెల 20 వ తేదీన ఆమె హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుపై గెలుపొందారు.
Must Read :- రేవంత్ రెడ్డికి కరోనా .. కాంటాక్ట్ పర్సన్లు టెస్టులు చేయించుకోండి
టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
— Surabhi Vani Devi (@SurabhiVaniDevi) March 28, 2021