కరోనా ఎఫెక్ట్ శాసన మండలిపై పడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. సోమవారం అసెంబ్లీలో ఆవరణలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అయితే శనివారం మండలి సభకు హాజరై ఆయన బడ్జెట్ పై మాట్లాడారు. దాంతో మండలి సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు. దాంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి సభ్యులు కచ్చితంగా టెస్టులు చేసుకోవాలని అన్నారు. సభ్యులు విధిగా మాస్కులు ధరించాలన్నారు. కరోనా ఎఫెక్ట్ తో అసెంబ్లీ సమావేశాల తేదీని కూడా కుదించనున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- మంత్రి సత్యవతి రాథోడ్‌కు కరోనా పాజిటివ్











