మీరు వాట్సాప్ వాడుతున్నారా… అయితే అలర్ట్ గా ఉండండి. గత కొన్నిరోజులుగా అమెజాన్ ఉచితంగా బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని తేలింది. అమెజాన్ 30వ వార్షికోత్సవం జరుపుకుంటుందని, సంస్థ ఫ్రీ ఫోన్, గిఫ్టులు ఇస్తుందంటూ సైబర్ నేరగాళ్లు కొంతమంది లింకులు పంపుతున్నారు. బహుమతి సంగతి పక్కన పెడితే, కానీ అలాంటి లింకులు క్లిక్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం ఉందని పలువురు ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో అమెజాన్ పేరిట లింక్స్ వస్తే, అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. అసలు అమెజాన్ స్థాపించి 30 ఏళ్లు కూడా కాలేదు. అంత పెద్ద సంస్థ అఫర్లు ఇస్తే కచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఫేక్ లింక్ ఓపెన్ చేయకుండా ఉండటం బెటర్.
Must Read ;- ‘రామ్ సేతు’ నిర్మిస్తున్న అమెజాన్ ప్రైమ్