‘ఉప్పెన’ తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది తుళు సుందరి కృతి శెట్టి. ఆ ఒక్క సినిమాతోనూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకొనే ప్రయత్నంలో పడ్డారు టాలీవుడ్ హీరోలు, మేకర్స్ . ఈ నేపథ్యంలో అమ్మడికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన కథానాయికగా ఛాన్స్ దక్కిందనే టాక్స్ వినిపిస్తున్నాయి. రామ్ ఈ సంక్రాంతికి ‘రెడ్’ సినిమాతో సందడిచేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మిశ్రమ ఫలితం అందుకుంది. అందుకే తదుపరి సినిమా విషయంలో కాస్తంత కేర్ఫుల్ గా వ్యహరించ నున్నాడు. ఈ క్రమంలో తమిళ దర్శకుడు లింగుసామి తో వర్క్ చేసేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు.
ఇటీవల వీరి కాంబో మూవీ ఎనౌన్స్ మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు సంబంధించి ‘ఉస్తాద్ రామ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ లో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి కి ప్లేస్ దక్కినట్టు తెలుస్తోంది. మరో హీరోయిన్ గా నివేదా పెతురాజ్ ఎంపికైందట. రామ్ నటించిన రెడ్ లో నివేదా నటించిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలనుకున్న లింగుసామికి బన్నీతో సినిమా చేసే ఛాన్స్ మిస్సయింది. ఎట్టకేలకు ఇప్పుడు రామ్ తో సినిమా చేసే అవకాశమొచ్చింది. అందుకే ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. మరి కృతికి లింగుసామి సినిమా ఏ రేంజ్ లో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.