తెలుగులో పలు సినిమాల్లో నటించినా.. మోనాల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే.. బిగ్ బాస్ 4లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ షోతో బాగా ఫేమస్ కావడంతో ఈ అమ్మడుకు ఇప్పుడు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. టీవీ షోలకు జడ్జిగా, అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కోసం మోనాల్ ని కాంటాక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తను లవ్ లో పడ్డానని అతని పేరు ఏ అనే ఇంగ్లీషు అక్షరంతో స్టార్ట్ అవుతుందని చెప్పింది.
మోనాల్ అలా చెప్పడంతో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అభిజిత్ కానీ, అఖిల్ కానీ అయ్యుంటారు అనుకున్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్ వ్యూలో మోనాల్ కి ఎదురైన ప్రశ్న తను ప్రేమించిన వ్యక్తి పేరు ఏ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది అన్నారు కదా.. ఏ అంటే ఎవరో పేరు చెప్పండి అని అడిగితే.. ఏ అంటే యాపిల్ అంటూ తెలివిగా సమాధానం చెప్పి అసలు విషయం దాటేసింది.
తాజాగా ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చేసింది. ఏ అంటే ఆర్యన్ అని చెప్పింది. ఇంతకీ ఆర్యన్ ఎవరంటే.. మలయాళీ హీరో. సుడిగాడు సినిమా తర్వాత మలయాళంలో ఆఫర్ వస్తే మాలీవుడ్ వెళ్లిందట. అక్కడ ఆర్యన్ తో కలిసి డ్రాకులా అనే సినిమాలో నటించిందట. అప్పటి నుంచి వీరిద్దరి పరిచయం ప్రేమగా మారిందట. 5 సంవత్సరాల లవ్ జర్నీ ఆనుకోకుండా బ్రేక్ అప్ అయ్యిందట. ఆర్యన్ సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కావడంతో మళ్లీ సౌత్ వైపు చూడలేదట. గుజరాతీ సినిమాలు చేస్తూ అక్కడే ఉంది. ఇప్పటి వరకు తన లవ్ స్టోరీని బయటపెట్టని ఈ అయ్యుడు ఇటీవల ఇలా బయటపెట్టడం విశేషం.
Must Read ;- మోనాల్ అంత డిమాండ్ చేస్తుందా..?











