బిగ్ బాస్ 4 లో లాస్ట్ వీక్ బయటకు వచ్చిన కంటెస్టంట్ మోనాల్. అసలు.. మోనాల్ అన్ని వారాలు హౌస్ లో ఎలా ఉందో అనేది చాలా మందిలో ఉన్న సందేహం. కొంత మంది అయితే.. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారమే మోనాల్ ఇప్పటి వరకు హౌస్ లో ఉంది అంటారు. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించడం.. కాస్తోకూస్తో తెలిసిన ముఖం కావడంతో ఆమె హౌస్ లో ఉంటే బాగుంటుందని ఇలా ప్లాన్ చేసారంటుంటారు. ఇదిలా ఉంటే.. హౌస్ నుంచి బయటకు రావడమే ఆలస్యం.. బయటకు వచ్చిన వెంటనే మీడియాకి ఇంటర్ వ్యూలు ఇస్తుంటారు.
మోనాల్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయలేదు. బయటకు వచ్చిన వెంటనే కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్ వ్యూలు ఇచ్చింది. అయితే.. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో తన లవ్ స్టోరీని బయటపెట్టింది. ఇంతకీ మోనాల్ లవ్ స్టోరీ ఏంటంటే.. తెలుగు సినిమాల్లో నటిస్తున్నప్పుడు మలయాళ సినిమాలో ఆఫర్ వచ్చిందట. మలయాళంలో ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఆ రిలేషన్ కొన్నాళ్లు కొనసాగింది. అయితే.. కొన్ని కారణాల వలన లవ్ బ్రేక్ అప్ అయ్యిందని చెప్పింది.
Must Read ;- మోనాల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు…!
అప్పటి నుంచి సౌత్ లో సినిమాలు చేయకూడదు అనుకుందట. అందుకనే వరుసగా గుజరాతీలో సినిమాలు చేస్తున్నాను. లవ్ బ్రేక్ అప్ వలనే సౌత్ సినిమాలకు దూరమయ్యానని చెప్పింది. మరి.. ఇప్పుడు తెలుగులో అవకాశాలు వస్తే చేస్తారా.? అంటే ఎందుకు చేయను తప్పకుండా చేస్తానంటుంది. మరి.. ఇప్పుడు తెలుగులో అవకాశాలు వస్తాయి ఏమో చూడాలి.
Also Read ;- అవినాశ్ వెల్ కమ్ బ్యాక్ పార్టీలో శ్రీముఖి సందడి