‘బిగ్ బాస్’ సీజన్ 4లో అల్లరిపిల్లగా ‘హారిక‘ మంచి మార్కులు కొట్టేసింది. ఎప్పుడూ చూసినా చురుకుగా .. చలాకీగా కనిపిస్తూ సందడి చేసింది. గేమ్స్ అంటే చాలు తనదైన దూకుడు చూపిస్తూ ఆకట్టుకుంది. తన మనసుకి కష్టం కలిగిన సందర్భాల్లో ఆమె స్పందించిన తీరు కూడా ప్రేక్షకులకు నచ్చింది. అటు ఆనందం .. ఇటు ఆవేదన తన పోటీదారులతో ఆమె పంచుకున్న తీరు కూడా ఆమెకి ఎక్కువ ఓట్లను తెచ్చిపెట్టాయి. మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడేయడమే ఆమెను ‘టాప్ 5’కి చేర్చింది. అలాంటి హారిక బయటికి వచ్చిన దగ్గర నుంచి ఇంటర్వ్యూలతో బిజీ అయింది.
తాజా ఇంటర్వ్యూలో హారిక మాట్లాడుతూ .. “నేను నమ్మలేకపోతున్నాను .. అప్పుడే 100 రోజులు పూర్తయ్యాయా అని. అంతలా సమయమనేది తెలియకుండా ‘బిగ్ బాస్’లో గడిచిపోయింది. ఒక వాచ్ .. టీవీ .. ఫోన్ .. లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందనేది అర్థమైంది. ‘బిగ్ బాస్’ ఒక ప్రత్యేక ప్రపంచం అనిపించింది. బిగ్ బాస్ హౌస్ లో ‘హెయిర్’ కట్ చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నేను హెయిర్ కట్ చేసుకోవడం మా అమ్మకి నచ్చదు. మా అన్నయ్యకి అసలే ఇష్టం ఉండదు. అందువలన వాళ్లు గుర్తొచ్చి టెన్షన్ అయ్యాను.
ఇక మన ఇంట్లో .. మనవాళ్లతో ఉండటం వేరు, ఇతరులతో కలిసి ఉండటం వేరు. ఏ సందర్భంలో ఏదైనా అంటే ఇంట్లో వాళ్లు పడతారుగానీ, వేరే వాళ్లు ఎందుకు పడతారు? మా వాళ్లు ఏమైనా అంటే ఒక రేంజ్ లో రెచ్చిపోయేదానిని. కానీ బిగ్ బాస్ హోస్ లో ఎంతో ఓర్పుగా ఉండవలసి వచ్చింది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ .. సంబందర్భానికి తగినట్టుగా నడచుకోవలసి వచ్చింది. నా వలన ఎవరూ హర్ట్ కాకుండా .. నేను హర్ట్ అయినప్పుడు ఓవర్ గా ఎమోషన్ కాకుండా చూసుకున్నాను. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ నుంచి నేను ఎంత ‘సహనం’గా ఉండాలనేది నేర్చుకున్నాను. సహనంగా ఉండటమనేది కెరియర్ కి ఎంతగా హెల్ప్ అవుతుందనేది నాకు అర్థమైంది” అని చెప్పుకొచ్చింది.
Must Read ;- లవ్ స్టోరీ బయటపెట్టిన మోనాల్.. !