జబర్దస్త్ కామెడీ షో తో కావల్సినంత హాట్ నెస్… బోలెడంత బోల్డ్ నెస్ మిక్స్ చేసి ఫాలోవర్స్ ను విపరీతంగా పెంచుకుంది అందాల యాంకర్ అనసూయ. ఆ షో తెచ్చిపెట్టిన క్రేజ్ తో సినిమాల్లోనూ తనకు తగ్గ పాత్రలు పోషిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు ఓ స్టెప్ ముందుకేసి.. ఇతర భాషల్లో సైతం కీలక పాత్రలు పోషించే స్థాయికి చేరుకుంది మన రంగమ్మత్త. ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తోన్న అనసూయ.. విజయ్ సేతుపతి హీరోగా నటించే సినిమాతో కోలీవుడ్ లోనూ పాదం మోపుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా అనసూయ .. మలయాళ సినిమాలో సైతం ఎంట్రీ ఇస్తూండడం విశేషంగా మారింది. మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించే ఇంకా పేరుపెట్టని ఓ సినిమాలో అనసూయని ఓ ప్రధాన పాత్ర కోసం సంప్రదించాడట ఆ సినిమా దర్శకుడు. అందులో తన పాత్ర బాగా నచ్చి అనసూయ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆల్రెడీ అనసూయ మమ్ముట్టి నటించిన తెలుగు సినిమా యాత్రలో ఓ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని, అనసూయ ఆ సినిమా కోసం బాగానే డేట్స్ కేటాయిస్తున్నట్టు టాక్. అనసూయ నటించిన కొన్ని తెలుగు సినిమాలు మలయాళంలో కూడా అనువాదమయ్యాయి. అందుకే అమ్మడి క్రేజ్ మాలీవుడ్ దాకా పాకిందని తెలుస్తోంది. మరి మలయాళీలకు రంగమ్మత్త నటన ఏ మేరకు నచ్చుతుందో చూడాలి.
Must Read ;- తెల్లా తెల్లని చీరలోన చందమామా..!