విజయసాయి పై ఘాటు విమర్శలు ఎక్కుపెట్టి రఘురామ..
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై ఎంపీ రఘురామ ఘాటు విమర్శలను ఎక్కుపెట్టి మరి సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశాడు. విశాఖ ను గెంటేసి, అండమాన్ నికోబార్ కు పంపించినా సిగ్గులేదని విజయసాయి పై ఎంపీ రఘురామ ఫైర్ అయ్యాడు. పార్టీ అధినేత, సీఎం జగన్ రెడ్డి చేతిలో తన్నులు తిన్నా దేవుడు సిగ్గుపెట్టలేదని, రేపోమాపో నా దారే పడతాడని పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు. తాజా సోమవారం ట్విటర్ వేదికగా మరోసారి విజయసాయిపై విరుచుకుపడ్డారు రఘురామ. వివేకా హత్య తర్వాత ఆయన గుండేపోటుతో మరణించాని విజయసాయి ప్రకటించారని, తరువాత గొడ్డలి పోటుతో మరణించారని తెలిసి.. టీడీపీ నేతలే హత్య చేశారని ఆరోపిచడం ఏమిటని? రఘురామ ప్రశ్నించారు. అసలు వివేకను ఎవరు చంపారో అందరికీ తెలుసునని.. చివరికి సీబీఐ విచారణలో వైసీపీ నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయన్నది వాస్తవం కాదా? అని గుర్తు చేశారు.
సీబీఐ ఆదుపులోకి తీసుకున్న శివశంకర్ రెడ్డి ఎవరు?
ఏపీలో అధికార వైసీపీ చర్యలను నిత్యం సోషల్ మీడియా వేదికగా ఎండగట్టే ఆ పార్టీ ఎంపీ రఘురామ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు విజయసాయిని మరోసారి టార్గెట్ చేశాడు. గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించే విజయసాయి.. వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన శివశంకర్ రెడ్డి ఎవరని ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఆయన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కాదా? అని రఘురామ నిలదీశాడు. గొడ్డలి పోటును.. గుండెపోటని ఎందుకు చెప్పావ్? .. ఎవరు చెప్పమన్నారని విజయసాయిని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎవర్ని కాపాడాలని ఈ ఘటనను టీడీపీపైకి నెట్టారని మండిపడ్డారు. హత్యలు చేసేది ఎవరో.. ఆ ట్రాక్ రికార్డు చూసి భయపడుతున్నామని రఘురామ కామెంట్స్ చేశారు. ఏదీఏమైనా ఎంపీ రఘురామ అధికార వైసీపీపై విమర్శలు దూకుడు పెంచాడు. దీంతో ఈ సారి రఘురామ సంధిస్తున్న విమర్శనాస్త్రాలు చూస్తుంటే.. అధికార వైసీపీకి మరోసారి శిరోభారం నెక్స్ట్ లెవల్ మాదిరిగా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.