తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది! సినీ, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే కోవిడ్ భారీనపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కరోనా భారీన పడినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతాలో లోకేష్ వెల్లడించారు. ప్రస్తుతం తాను కోలుకునే వరకూ సెల్ప్ ఐసోలేట్ అవుతానని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఏమీ లేకున్న పరీక్షల్లో పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు వివరించారు. అలానే తాను చాలా బాగున్నాని, ఆందోళన చెందనక్కర్లేదని చెప్పారు. తాను కోలుకునే వరకు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటానన్నారు. నన్ను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకుని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ సేఫ్ గా ఉండాలని అర్థిస్తున్నాని లోకేష్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.