సీఎం జగన్ కు, వైసీపీ ఎంపీ రఘురామరాజు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేఖలు రాస్తున్నారు. తాజాగా శనివారం సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో లేఖ రాశారు. వైఎస్సార్ పెళ్లికానుక, షాదీ ముబారక్ పథకాలపై రఘురామ లేఖ రాశారు. అధికారంలోకి వస్తే పెళ్లికానుక ఆర్థికసాయం పెంచుతామన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని రూ.లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారని, ప్రజలు కూాడా సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని రఘురామ లేఖలో సూచించారు.
Must Read ;- పింఛన్ల హామీ నెరవేర్చండి.. సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఎంపీ రఘురామరాజు లేఖ












