మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. శామీర్ పేటలోని తన ఇంటి నుంచి అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో పెద్ద ఎత్తున గన్ పార్కుకు చేరుకొని నివాళి అర్పించారు. అనంతరం అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌరవులు, పాండవులకు యుద్ధం జరుగబోతుందని అన్నారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని, హుజూరాబాద్ ప్రజలతో తగిన బుద్ధి చెప్తామన్నారు. గతంలో ఎన్నోసార్లు తనపై కుట్ర జరిగిందిదని, ఓడించే ప్రయత్నాలు కూడా చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి, ఉప ఎన్నికలో గెలవాలని చూస్తుందని అన్నారు. తనతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, ఎంపీపీలు పార్టీలో చేరుతారని ఈటల అన్నారు.
Must Read ;- ప్రజాస్వామ్య బద్ధంగా హుజూరాబాద్‌లో గెలవండి.. టీఆర్‌ఎస్‌కు ఈటల సవాల్












