తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం గాంధీ ఆస్పత్రిని విజిట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కేసీఆర్ తీరుపై విరుచుకుపడ్డారు. గతంలో సీఎం కేసీఆర్ ఉస్మానియాకు వెళ్లారని, అరచేతిలో వైకుంఠం చూపించి హామీలు మరచిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ మరో ఉస్మానియా కాకూడదని గుర్తు చేశారు. గాంధీ పర్యటనలో ఉన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి కొన్ని డిమాండ్లు లెవనెత్తారు. సేవలో ఉన్న నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాలు రూ8 వేల నుంచి 16 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్ కు ఇంత వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. జూడాల సమస్యలను పరిష్కరించి, కోవిడ్ తో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Must Read ;- ఆపదకాలంలో అండగా : కరోనా బాధితుల కోసం రేవంత్ రెడ్డి హాస్పిటల్
👉🏻జూడాలతో ఆసుపత్రి వేదికగా చర్చలు జరిపి,అక్కడికక్కడే పరిష్కరించాలి
👉🏻గాంధీలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యల పై టైం టార్గెట్ పెట్టుకుని పరిష్కరించాలి
👉🏻గతంలో ఉస్మానియాకు వెళ్లి అరచేతిలో వైకుంఠం చూపించారు.ఆ హామీలు ఇప్పటికీ నెరవేరలేదు
👉🏻నేటి గాంధీ పర్యటన మరో ఉస్మానియా పర్యటన కాకూడదు— Revanth Reddy (@revanth_anumula) May 19, 2021