తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ పార్టీ పెట్టే ఏర్పాట్లలో ఉన్న వైఎస్ షర్మిల, ఏపీలో కూడా రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు పోరాడాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్టంరాజు సూచించారు. మాజీ మంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లు అవుతున్నా నేటికీ నిందితులను అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంటిదొంగలెవరో వైసీపీ ప్రభుత్వం తేల్చాలని రఘురామరాజు డిమాండ్ చేశారు.
సీబీఐ విచారణ ఎందుకు ఆగిపోయింది
హైకోర్టు ఆదేశాల మేరకు వివేకానందరెడ్డి హత్య కేసును చేపట్టిన సీబీఐ విచారణ ఎందుకు నిలిపి వేసిందని వైసీపీ ఎంపీ రఘురామరాజు ప్రశ్నించారు. ఈ కేసుపై వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉండి సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్ నేడు నోరు తెరవడం లేదెందుకని రఘరామరాజు ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేపట్టినా ఒక్క అడుగు ముందుకు పడలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి కత్తిపోట్లతో చనిపోతే శవానికి కుట్లు వేసి గుండె పోటుతో చనిపోయాడని ప్రచారం చేయాలని ప్రయత్నం చేయడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు.
Also Read : అప్పులు చేయడంలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్.. ఎంపీ రఘురామకృష్ణంరాజు