తెలుగు సినీ సంగీత సామ్రాజ్యాన్ని కొన్ని దశాబ్దాల కాలం పాటు ఏలిన సంగీత ద్వయం రాజన్ నాగేంద్ర. అందులో నాగేంద్ర ఇదివరకే చనిపోగా.. ఇప్పుడు రాజన్ కన్నుమూశారు. బెంగళూర్ లోని తన నివాసంలో గతరాత్రి ఆయన తుది శ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలకు నాగేంద్ర తో కలిసి రాజన్ .. మెలోడీ స్వరాలు అందించారు.
1952లో విడుదలైన సౌభాగ్యలక్ష్మి సినిమాతో రాజన్ నాగేంద్ర స్వరంగేట్రం చేశారు. ఆ ఇద్దరి జోడీ 37 సంవత్సరాలపాటు.. మరచిపోలేని రీతిలో మధుర గీతాలతో దక్షిణాది ప్రేక్షకుల్ని ఓలలాడించారు. ‘అగ్గిపిడుగు, పూజ, పంతులమ్మ, మూడు ముళ్లు, ప్రేమఖైదీ, నాలుగు స్థంబాలాట, రెండు రెళ్ళు ఆరు, సొమ్మొకడిది సోకొకడిది, నాగమల్లి, పులిబెబ్బులి’.. తదితర సినిమాలకు సంగీతం అందించారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.











