సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది లోకల్ బ్యూటీలు చాలా ఈజీగా సినిమాల్లోకి వచ్చేశారు. సోషల్ మీడియా వేదికగా వీరంతా తమలో దాగి ఉన్న యాక్టింగ్ స్కిల్స్ బయటపెడుతూ సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్నారు.
అయితే ఇలా సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోకి వస్తున్న వారిలో చాలా మంది లోబడ్జెట్ సినిమాల్లోనే కనిపిస్తూ ఆ తరువాత మెల్లిగా బీ గ్రేడ్ హీరోయిన్లుగా మిగిపోతున్నారు. గద్దలకొండ గణేశ్ లో హీరోయిన్గా నటించిన టిక్ టాక్ స్టార్ మృణాళిని రవికి మాత్రం అది పెద్ద ఆఫర్ అనే చెప్పాలి.
ఈ పాప టిక్ టాక్ లో ఎక్స్ ప్రెషన్స్ బాగా ఇస్తూ వీడియోలు చేస్తుందనే కారణంగా హరీశ్ శంకర్ తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. అయితే ఏమాటకి ఆ మాటే, మృణాళిని రవి- గద్దలకొండ గణేశ్ లో అదరగొట్టేసింది.
డ్యాన్సులు, స్కిన్ షో, ఎక్స్ ప్రెషన్స్ తో బాగానే పేరు తెచ్చుకుంది. అయితే మృణాళిని చేసిన ఒకే ఒక మిస్టేక్ ఈ ఒక్క సినిమాతో తాను స్టార్ అయిపోయాను అని ఫిక్స్ అయిపోవడమే, గద్దలకొండ గణేశ్ తరువాత ఈ పాపకు వచ్చిన ఒకటి రెండూ ఆఫర్లను కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగి కాలదన్నుకుంది.
దీంతో ఈ బ్యూటీని తెలుగు దర్శకనిర్మాతలు పక్కనపెట్టేశారు. దీంతో చాలా లేటుగా తన మిస్టేక్ తెలుసుకొని, రేటు తగ్గించుకొని తాజాగా తెలుగులో మళ్లీ అవకాశాలు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిందని అంటున్నారు. మరి ఈ పాపకి ఎవరు అవకాశం ఇస్తున్నారో చూడాలి.