నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, రిలీజ్ కావాల్సింది. అయితే కరోనా కారణంగా కేంద్రం లాక్ డౌన్ విధించడంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం షూటింగ్లకు అనుమతి ఇచ్చినా ఇప్పటి వరకు ఈ సినిమాకు సంభందించి ఎటువంటి షూటింగ్ ప్రారంభించలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ సినిమా షూటింగ్ అన్ని జాగ్రత్తలతో అక్టోబర్ 27వ తేదీన అంటటే రేపే హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 19వ తేదీ వరకూ జరిగే షూటింగ్ లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారని సమాచారం. ఆతర్వాత కొంచెం గ్యాప్ తీసుకోని పాటలు షూట్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంభందించిన టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ దుమ్ము రేపే యాక్షన్ తో రెచ్చిపోయాడు. ముఖ్యంగా బాలయ్య పంచె కట్టు ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంది. సినిమాలో దాదాపు గా బాలయ్య పంచె కట్టుతోనే కనిపిస్తారట. కాగా బోయపాటి శ్రీను – బాలయ్య కలయికలో ఈ సినిమా మూడోవ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటివరకు వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’ వంటి సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఈసారి కూడా దర్శకుడు బోయపాటి తమకు సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బోయపాటి – బాలయ్య మూడోవ సినిమా అభిమానులను అలరించి సూపర్ బ్లాక్ బస్టర్ అందుకుంటుందో లేదో చూడాలి మరి.