ఎలాంటి సినిమా చేస్తున్నా.. అందులో తనదైన శైలిలో వినోదాన్ని పండించడం నానీ స్టైల్. సీరియస్ మోడ్ లో కూడా నానీ స్టైలాఫ్ చురకలు ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తాయి. తాజాగా అతడు నటిస్తోన్న ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీలో కూడా నానీ ట్రేడ్ మార్క్ పంచులు అలరిస్తాయట. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకథ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ట్రావెల్ అవుతుందని అంటున్నారు.
నానీ ద్విపాత్రాభినయం చేస్తోన్న శ్యామ్ సింగరాయ్ లో ఒక పాత్రలో అతడు దర్శకుడిగానూ, మరో పాత్రలో 70 ఏళ్ళ ముసలివాడిగానూ కనిపించనున్నాడని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. అందులో దర్శకుడి పాత్ర కాపీ లపై సెటైర్స్ వేస్తుందట. అతడి తీసిన సినిమాకు కాపీ మరక అంటుకుంటే.. నాది కాపీ సినిమా కాదని అతడు పోరాడే విధానం మంచి వినోదం పంచుతుందట. అసలు ఈ సినిమా అంతా కాపీ వివాదం మీదే సాగుతుందని ఫిల్మ్ నగర్ టాక్.
ముఖ్యంగా కోల్ కత్తా నేపథ్యంలో సాగే ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతాయని ఇన్ సైడ్ టాక్. ‘వి’ మూవీతో అపజయంతో పాటు విమర్శల్నీ మూటగట్టుకొన్న నేచురల్ స్టార్.. తదుపరి సినిమాలైన టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ మూవీస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. మరి శ్యామ్ సింగ రాయ్ మూవీ నానీ కెరీర్ ను ఏ రేంజ్ లో మలుపు తిప్పుతుందో చూడాలి.











