సీఎం చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లో భువనేశ్వరి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025 అవార్డును భువనేశ్వరికి అందజేశారు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ప్రతినిధులు.
హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును సైతం ఆ సంస్థ VCMD అయిన భువనేశ్వరికి ఇదే వేదికపై అందజేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో వివిధ రంగాల్లో చేసిన విశేష కృషికిగానూ భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025 పురస్కారాన్ని అందించారు. NTR ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, మహిళా సాధికారత, విపత్తుల్లో సహాయం తదితర అంశాల్లో ఆమె విస్తృత సేవలందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ పథకాలు, మహిళల ఆర్థిక చేయూత లాంటి సేవా కార్యక్రమాలు అమలుచేస్తూ ప్రజల మన్ననలు పొందారు. తలసేమియా రోగులకు ఉచితంగా రక్తమార్పిడి చేయిస్తున్నారు.
దేశంలోనే ప్రతిష్ఠాత్మక డెయిరీ బ్రాండ్‌గా హెరిటేజ్‌ను తీర్చిదిద్దడం, ఆ సంస్థ ఎదుగుదల, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, కోట్ల మంది వినియోగదారులకు ఆ ఉత్పత్తులు చేరువయ్యేలా చేయడంలో భువనేశ్వరిది కీరోల్. ఈ సంస్థ కార్యకలాపాల ద్వారా రైతుల సాధికారతకు ఆమె పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును ఆ సంస్థ వీసీఎండీ హోదాలో భువనేశ్వరి అందుకున్నారు











