మంత్రి నారా లోకేష్..ఎంత బిజీగా ఉన్నా, సామాన్యుల కోసం, కార్యకర్తల కోసం తన సమయాన్ని కేటాయిస్తూనే ఉన్నారు. మంగళవారం తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో 70వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ దర్బార్‌కు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. లోకేశ్ వస్తున్నారనే సమాచారంతో ఉదయం 5 గంటలకే వేలాది మంది పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు 4 గంటలపాటు సుమారు 4 వేల మంది సమస్యలు ఓపికతో విని వినతులు స్వీకరించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి వేదన విన్నారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వినతులపై అక్కడి నుంచే సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.
నిజానికి ప్రతీసారి ప్రజా దర్బార్ ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించేవారు. ఇది కేవలం మంగళగిరి ప్రజల కోసం ఉద్దేశించిన కార్యక్రమం. ఐతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా లోకేష్‌తో తమ సమస్యలు చెప్పుకుంటారు. దీంతో ఈ సారి నారా లోకేష్ టీడీపీ ఆఫీసులో ప్రజలు, క్యాడర్ సమస్యలు విన్నారు.
నారా లోకేష్ పార్టీలో ఒక ఎకోసిస్టమ్ ఉండాలని ప్రయత్నిస్తున్నారు. సాయం కోసం..సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి ఎక్కువ శ్రమ లేకుండా కింది స్థాయిలోనే పరిష్కారం దొరకాలని భావిస్తుంటారు. అలాంటి ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఐతే కొంత మంది అధికారులు, నేతల నిర్లక్ష్యం కారణంగా అది ఆలస్యమవుతూ వస్తోంది.
కొన్ని నియోజకవర్గాల్లో నేతలు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రజలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాంటి వారి వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అలాంటి వారిని మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే అందరూ నారా లోకేష్ దగ్గరకు వెళ్తే మాత్రమే సమస్య పరిష్కారమవుతుందని భావిస్తారు. అది భవిష్యత్తులో ఇబ్బంది మారే అవకాశం ఉంది











