అమరావతి అసైన్డ్ భూముల కేసుపై టీడీపీ నిజనిజాలు తేల్చింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై పెట్టిన కేసులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కుట్రలు చేసిందని టీడీపీ నాయకులు ఆధారాలతో సహా వీడియోలు, ఫొటోలను బయటపెట్టారు. అమరావతిలో రాజధాని ఉండటం ఇష్టం లేకనే, వైఎస్ జగన్ దిగుజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ లో స్పందించారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు.
Also Read:ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదు : నారా లోకేశ్
నిజమేంటో జనానికి తెలిసేసరికి, జగన్‌రెడ్డి సృష్టించిన అబద్ధాలు ప్రపంచం చుట్టి వస్తున్నాయి. అసత్యప్రచారమే పెట్టుబడిగా తెచ్చుకున్న అధికారం అండతో అమరావతిపై పన్నిన మరో కుట్రని తెలుగుదేశం బట్టబయలు చేసింది. #StingOperationExposesJagan pic.twitter.com/q0TFtYGLUh
— Lokesh Nara (@naralokesh) March 25, 2021