ప్రజల ప్రాణాలు గాలికొదిలి ప్రతిపక్ష నేతలు భవనాలు కూల్చే పనిలో జగన్ రెడ్డి బిజీగా ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి, కార్మికుల పక్షాన నిలిచినందుకే టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ గారిపై కక్ష చర్యలకు దిగారని పేర్కొన్నారు. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేయాలని ప్లాన్ చేసిన జగన్ రెడ్డికి అడ్డొచ్చారు అనే అక్కసుతోనే ఆదివారం పూట పల్లా గారి ఆస్తుల ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే కనీసం నోటీసు ఇవ్వకుండా, చట్టాన్ని తుంగలో తొక్కి యుద్ధ వాతావరణంలో భవనాన్ని కూల్చివేయ్యడాన్ని, కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండించారు. నీ జేసీబీ ఊపులకు భయపడే వాడు ఎవడూ లేడని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి టీడీపీ దేనికైనా సిద్ధమే నారా లోకేశ్ అన్నారు.
Must Read : కరోనాతో చిత్తూరు టీడీపీ నాయకుని మృతి











