సినీ సంగీత ప్రపంచంలో ఎస్పీ బాలుది ప్రత్యేక స్థానం. ఆయన గళం నుంచి జాలువారే.. ప్రతిస్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే. ఆయన గొంతు నుండి వచ్చిన ఏ గీతమైన శ్రోతలను తప్పక అలరిస్తుంది. ఆబాలగోపాలాన్ని తన గానమాధుర్యంతో ఓలలాడించిన గానగంధర్వుడు స్వర్గీయ ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాలుకు నివాళి అర్పించారు. ‘‘వైతాళికుడి స్మృతికి నివాళులర్పిస్తున్నాను. ఎస్పీబీ గానం అమృతం, స్వరం అమరం. ఎస్పీబీ ఏ లోకంలో వున్నా పాడుతూనే వుంటారు తీయగా ..హాయిగా…చల్లగా..’’ అంటూ ట్వీట్ చేశారు.
Must Read ;- డాక్టర్ రోజి మృతి తీవ్రంగా కలచివేసింది : నారా లోకేశ్
ఆబాలగోపాలాన్ని తన గానమాధుర్యంతో ఓలలాడించిన గానగంధర్వుడు స్వర్గీయ ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా ఆ వైతాళికుడి స్మృతికి నివాళులర్పిస్తున్నాను. ఎస్పీబీ గానం అమృతం, స్వరం అమరం. ఎస్పీబీ ఏ లోకంలో వున్నా పాడుతూనే వుంటారు తీయగా ..హాయిగా…చల్లగా.. pic.twitter.com/DUmTdAqaSK
— Lokesh Nara (@naralokesh) June 4, 2021