బనగానపల్లె టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. అక్రమ అరెస్టు ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెంటనే స్పందించి, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన జనార్దన్ కటుంబాన్ని ఫోన్ లో పరామర్శించారు. జనార్దన్ భార్య ఇందిరమ్మ, కుమారుడు మనోహర్ రెడ్డితో మాట్లాడారు. టీడీపీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్నిస్వార్థప్రయోజనాలకు వాడుతున్నారని, త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్తామని నారా లోకేశ్ అన్నారు.
Must Read ;- టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ అరెస్టు











