మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లనున్న నారా లోకేష్..ఢిల్లీకి వరుసగా కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ముందుగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ కానున్నారు. ఇటీవల బడ్జెట్‌లో ఏపీలో రైల్వేలకు నిధులు కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలపనున్నారు. కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపైనా కేంద్రమంత్రితో చర్చించనున్నారు లోకేష్. ఏపీకి భారీగా రైల్వే ప్రాజెక్టులను కేటాయించింది మోడీ సర్కార్.. ఏకంగా 9,500 కోట్లు కేటాయించారు.. ఇటు అమరావతికి సైతం మూడు మార్గాల ద్వారా కనెక్టివిటీ ఉండేలా ప్రత్యేక రైలు మార్గాలకు లైన్‌లు క్లియర్ చేశారు..
2019లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరవాత అమరావతి రైల్వే కనెక్టివిటీని దూరం చేసింది.. ఇటు, నిధులు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి.. జగన్ కేవలం తన కేసులు, సీబీఐ విచారణ నుండి తప్పించుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోకస్ మారింది.. మరోసారి అమరావతి, పోలవరం తెరమీదకి వచ్చాయి.. తమ ప్రభుత్వ ప్రియారిటీలను కేంద్రానికి వివరించడానికి లోకేష్ శ్రద్ధ చూపిస్తున్నారు తన ఢిల్లీ పర్యటనలో..
ఇక రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ విధానాన్ని కేంద్రమంత్రులకు వివరించనున్నారు.విశాఖను ఐటీ హబ్‌గా, రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చేందుకు ప్రోత్సహకాలు అందించి సహకరించాలని కేంద్రమంత్రులను కోరనున్నారు.
ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ లోకేష్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. జగన్ కేసుల అంశం, వైసీపీ హయాంలో జరిగిన అవినీతి గురించి అమిత్ షాకు వివరిస్తారని తెలుస్తోంది. జగన్ పాలనలో జరిగిన అవినీతి కేసులపై విచారణను వేగవంతం చేయాలని అమిత్ షాను లోకేష్ కోరనున్నారని తెలుస్తోంది. లోకేష్ ఢిల్లీ పర్యటనతో జగన్‌లో వణుకు మొదలైందని సమాచారం.
మరోవైపు, ఇటీవల వైజాగ్ పర్యటనకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. యువ మంత్రి లోకేష్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓ ఫిర్యాదు చేశారు.. ఏపీలో భారీ విజయం తర్వాత ఢిల్లీకి వచ్చి తనను ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు.. త్వరలోనే కుటుంబ సమేతంగా హస్తినకు వచ్చి తనను కలవాలని అన్నారు.. దానికి లోకేష్ సైతం ఓకే అన్నారు.. అయితే, ఈ తాజా పర్యటనలో మంత్రి లోకేష్, ప్రధాని మోదీతో భేటీ అవుతారా?? లేదా .?? ఆసక్తిగా మారింది.. హోమ్ మంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీలో రెడ్ బుక్‌లోని కొన్ని కీలక పేజీలను ఓపెన్ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.. దీని తర్వాత ఏపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి..