కొడుకుతో సమానంగా చూడాల్సిన అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని కూతురి జీవితాన్ని, సంసారాన్ని నాశనం చేసింది. తన తల్లి అనిత, భర్త నవీన్‌ల వివాహేతర సంబంధం తెలిసిన ఆ కూతురు ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణానికి అల్లుడితో వివాహేతర సంబంధమే ఒక కారణమని తెలిసినా మళ్లీ అలాగే కూతురు భర్తతో అక్రమ సంభంధాన్ని అనిత కొనసాగించి అల్లుడుని హత్య చేసింది.
హైదరాబాద్ రామాంతాపూర్‌లోని కేసీఆర్ నగర్‌కు చెందిన అనితకు కూతురుంది. తన కూతురిని నవీన్‌కు ఇచ్చి అనిత పెళ్లి చేసింది. అనితకు నవీన్‌తో వివాహేతర సంబంధం ఉంది. కూతురికి ఇచ్చి పెళ్లి చేసిన తరువాత కూడా నవీన్‌తో అనిత వివాహేతర సంబంధం కొనసాగించింది. వీరిద్దరి మధ్య కొనసాగుతున్న వివాహేతర సంబంధం తెలుసుకున్న అనిత కూతురు నాలుగు నెలల క్రితమే ఆత్మహత్య చేసుకుంది.
కూతురు మరణించాక కూడా అల్లుడితో ఆమె సంబంధం కొనసాగించింది. అయితే బుధవారం రాత్రి నవీన్‌ను అనిత కత్తితో హత్యచేసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే నవీన్‌ను అనిత అసలు ఎందుకు హత్య చేసిందో ఇంకా తెలియాల్సి ఉంది. వారిద్దరి మధ్య హత్యకు దారితీసిన విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.