దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనగానే అదేదో ప్రతిష్ఠాత్మక అవార్డు అనుకోకండి. ఆ పేరుతో ఏర్పాటైన ఓ సంస్థ దక్షిణాది నటీనటులకు ఈ అవార్డులు ఇస్తోంది. 2020 సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ నటుడిగా నవీన్ పొలిశెట్టి ఎంపికయ్యారు. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ చిత్రంలోని నటనకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఇందులో డిటెక్టివ్ పాత్రను ఆయన పోషించారు.
అక్కినేని నాగార్జునకు విలక్షణ నటుడిగా అవార్డు లభించింది. ఉత్తమ నటిగా డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించిన రష్మిక మందన్నకు, ఉత్తమ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ చిత్రానికి అవార్డులు లభించాయి. సాహో దర్శకుడు సుజీత్ ఉత్తమ దర్శకుడిగా, తమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని వచ్చే ఫిబ్రవరి 20న ముంబయిలోని తాజ్ లాండ్స్ ఎండ్ హోటల్ లో నిర్వహించనున్నారు.