మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత చేయనున్న సినిమా ‘లూసిఫర్’ రీమేక్. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. చిరు సరసన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించిన అందాల తార నయనతార ఈ సినిమాలో కూడా నటించనున్నట్టు సమాచారం. ‘సైరా’ సినిమాలో నయనతార పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించిందని విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు మరోసారి చిరు సినిమాలో నయనతార నటించనుంది. ఈ మూవీలో సీఎం డాటర్ రోల్ కి తీసుకున్నట్టు తెలిసింది. నయన్ ని తీసుకోవడం కన్ ఫర్మ్ అయ్యిందట. కాకపోతే.. నయన్ తో మాట్లాడి అగ్రిమెంట్ చేసుకోవాల్సివుంది. యంగ్ హీరో సత్యదేవ్ ని తీసుకున్నారు. ఇది నయన్ కు తమ్ముడి పాత్ర అని సమాచారం. ఇంకా ఈ మూవీలోని మరో రెండు కీలక పాత్రల కోసం ఎవర్ని తీసుకోవాలని ఆలోచిస్తుందట టీమ్.
ఈ క్రేజీ మూవీకి ముందుగా సుకుమార్, సుజిత్, వినాయక్ లను అనుకున్నప్పటికీ ఫైనల్ గా మెహన్ రాజాకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఎన్.వి.ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తైన వెంటనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. మలయాళంలో సక్సస్ సాధించిన ‘లూసిఫర్’ తెలుగులో ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.