హీరో రామ్ స్వల్పంగా గాయపడ్డారు. సినిమాలో ఓ పాత్ర కోసం జిమ్ చేస్తుండగా మెడకు గాయమైనట్టు తెలుస్తోంది. తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఇది రామ్ కు 19 వ సినిమా అవుతుంది. రెండో షెడ్యూల్ షూటింగులో రామ్ పాల్గొనాల్సి ఉంది. ఇటీవలే రెడ్ మూవీతో రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ సోదరుడి కుమారుడు రామ్ పోతినేని. తెలుగు, తమిళ భాషల్లో లింగు స్వామి చేసే సినిమా రూపొందుతోంది. సినిమాలో చేస్తున్న పాత్ర కోసమే వర్కవుట్ చేస్తుండగా మెడకు స్వల్ప గాయమైనట్టు తెలిసింది. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినట్టు సమాచారం. ఆస్పత్రిలో చేరలేదని, వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిసింది.
Must Read ;- 4 కోట్లతో రామ్ చరణ్ అధునాతన కారు











