What Is The Reason Of Sai Dharam Tej Bike Accident :
మనకు ప్రాణాల మీదకు వచ్చినా చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. సాయిధరమ్ తేజ్ కు జరిగిన ప్రమాదం విషయంలో కూడా అంతే. ఈ విషయంలో తప్పెవరిది? అన్నది మాత్రం తర్వాతి అంశం. బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం తాగి ఉన్నాడా? అత్యంత వేగంగా వెళుతున్నాడా? లైసెన్స్ ఉందా? నిర్లక్ష్యంగా బైక్ నడిపాడా అన్న అంశాలను ప్రాథమికంగా పరిశీలిస్తారు. అసలు రోడ్డు మీద ఇసుక ఎందుకు ఉంది? దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు శుభ్రం చేయడం లేదు? రోడ్ల మీద గుంతలను ఎందుకు పూడ్చటం లేదు లాంటి అంశాలను మాత్రం ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదు.
రాత్రి 8.05 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది. సాయిధరమ్ మద్యం సేవించలేదని మాదాపూర్ ఏసీపీ తెలిపారు. కాకపోతే నిర్లక్ష్యం, అత్యంత వేగంగా బైక్ నడపడం లాంటి అంశాల ఆధారంగా ఐపీసీ సెక్షన్ 336, 184 కింద కేసు నమోదు చేశారు. రోడ్డుపై ఇసుక ఉండటానికి కారణం ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ అని తెలుస్తోంది. మరి ఈ కంపెనీపై కూడా కేసు నమోదు చేయాలి కదా. ఇదే విషయాన్ని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా లేవనెత్తారు. ఆ కన్ స్ట్రక్షన్ కంపెనీపైనా, రోడ్లు శుభ్రం చేయని మున్సిపాలిటీపైనా ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. తప్పును ఒక కోణంలోనే చూడటం సరికాదన్నారు.
హెల్త్ బులెటెన్ విడుల
సాయిధరమ్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని అపోలో వైద్యులు ప్రకటించారు. కాలర్ బోన్ కు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, 8 వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. రేపు మళ్లీ హెల్త్ బులెటెన్ విడుదల చేస్తామన్నారు. మెగా కుటుంబం అంతా అపోలో ఆస్పత్రికి వెళ్లి సాయిధరమ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఉపాసన తదితరులంతా అపోలో ఆస్పత్రికి వెళ్లారు.
నిర్మాత అల్లు అరవింద్ ఈ ప్రమాదంపై అర్ధరాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. అతని ఆరోగ్యం విషయంలో కంగారు పడాల్సిన పనిలేదని, శరీరంలో ఎక్కడా ఇంటర్నల్ బ్లీడింగ్ లేదని వైద్యులు తనతో చెప్పినట్టు తెలిపారు. నటులు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కూడా ఆస్పత్రికి వచ్చారు. సాయిధరమ్ క్షేమంగా ఉన్నాడని, అభిమానులు ఆందోళన చెందవద్దని నాగబాబు తెలిపారు.