ఎనర్జిటిక్ హీరో రామ్, తమిళ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రానుందని అఫిషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాక్షన్, యాక్షన్ మూవీస్ ని అద్భుతంగా తెరకెక్కించే లింగుస్వామి రామ్ ని సరికొత్తగా ఎలా ప్రజెంట్ చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది.
ఇటీవలే లింగుస్వామి ఫైనల్ నేరేషన్ ఇచ్చారని, స్క్రిప్ట్ అద్భుతంగా ఉందంటూ రామ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా.. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నాను అని రామ్ అన్నాడు. రామ్ ట్వీట్ తో ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది.
Also Read:-అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ ?
త్వరలోనే ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది అనుకుంటుంటే.. ఈ సినిమాకు అడ్డంకులు ఎదురయ్యేలా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. లింగుస్వామి పై ప్రముఖ తమిళ నిర్మాత జ్ఙానవేల్ రాజా తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, సౌత్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు చేశారు. ఏమని ఫిర్యాదు చేశారంటే.. లింగుస్వామి గతంలో తమ బ్యానర్ లో సినిమా చేసేందుకు చాలా మొత్తంలో డబ్బు తీసుకున్నారని… ఇంత వరకు ఆయన తన ప్రామిస్ నిలబెట్టుకోలేదు. సినిమా చేసేందుకు తమ మధ్య ఒప్పందం జరిగింది కానీ.. ఇంత వరకు లింగుస్వామి తన ప్లాన్ తో ముందుకు రాలేదు.
డబ్బు కూడా తిరిగి చెల్లించడం లేదు అని జ్ఞానవేల్ రాజా ఆరోపించారు. హీరో రామ్ తో లింగుస్వామి సినిమా చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అంత కంటే ముందు మాతో సినిమా చేయాలి లేదా ఇష్యూ సెటిల్ చేయాలి. అంత వరకు ఆయన మరో ప్రాజెక్ట్ చేయకూడదు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. ఆయన ఇక్కడ మెంబర్ కాదు కనుక చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని తెలుగు ఫిలిం ఛాంబర్ జ్ఞానవేల్ రాజాకు తెలిపినట్లు సమాచారం. సౌత్ ఫిలిం ఛాంబర్, తమిళ్ ఫిలిం ఛాంబర్ కు ఈ వ్యవహారం వదిలేస్తున్నామని తెలిపారు. రామ్ ఈ మూవీని త్వరలోనే స్టార్ట్ చేద్దామనుకుంటుంటే.. ఇలా అడ్డంకులు వచ్చాయి. మరి.. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.
Must Read:-పుష్పలో అల్లు అర్జున్ ను ఢీకొనేది మాధవన్ అవునా కాదా?