కోవర్టులను ఏరిపారేస్తేనే.. పార్టీ పునర్మిర్మాణం జరుగుతోంది!
పార్టీలో కోవర్టులను ఏరిపారేసి, పునర్నిర్మాణం, పూర్వవైభవం, ప్రాభవం తీసుకొచ్చేందుకు అధినేత చంద్రబాబు సమలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు పనితీరును కూలంకుషంగా పరిశీలిస్తున్నట్లు తెలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకే గతంలో పార్టీలో ఉంటూ వైరిపక్షాలకు ఉప్పందించే కోవర్టులను ఏరిపారేసే పనిలో అధిష్టానం కసరత్తు చేస్తోంది. పార్టీ కమిటీల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో అధికారపార్టీ వైసీపీకి టీడీపీ నాయకులే సహకరించారని ఫిర్యాదులు రావడంతో, అటువంటి వారిపై పార్టీ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టాలి!
రాష్ట్రంలో పాలన సాగిస్తున్న అధికార వైసీపీ వైఫల్యాలను ఎండగట్టి .. ప్రజలకు అండగా నిలిచేలా టీడీపీ కార్యాచరణ ప్రారంభిస్తోంది. పార్టీ కోసం ప్రతిఒక్కరూ నిజాయితీగా పనిచేయాలని కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం పనిచేసేవారి పూర్తి వివరాలను సేకరించాం.. అధికారంలోకి రాగానే పదవులిచ్చి వారితో ప్రజాసేవ చేయిస్తామని చంద్రబాబు వెల్లడించారు. సమలోచనలు, సమిష్టి నిర్ణయాలు, తగిన వ్యూహాలు, తెగింపు వంటి వాటితోనే పార్టీ విజయం సాధిస్తోంది. అందుకు ప్రతిఒక్కరూ కష్టపడాలన్నారు. రాష్ట్ర పరిస్థితి బాగాలేదు. ప్రజలకు భరోసా, అండదండలు అవసరం. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు వివరించి, చైతన్య పర్చాలని ఆదేశించారు. త్వరగా బూత్ కమిటీలు వేసి, పార్టీని బలోపేతం చేయాలి. బూత్ కమిటీ మెంబర్లను అధికారంలోకి రాగానే ప్రజా సేవకు వినయోగిస్తామని అధినేత చంద్రబాబు వెల్లడిచారు.
Must Read ;- అధికారపార్టీలో తగ్గిన జోష్..! డైలామలో ఫ్యాన్ కేడర్!!











