అక్రమ దందాకు పాత్రదారులందురూ ఆ పార్టీవారే!
రాష్ట్రంలో అక్రమ దందాలకు కేంద్రం బిందువుగా అధికారపార్టీ నిలుస్తోంది. ఆ మొన్న డ్రగ్ మాఫియా నుంచి గంజాయి లిక్వీడ్ వడ పోతల వరకు వీరు చేసే దందాలు అన్ స్టాపబుల్! పొరుగు రాష్ట్రాల మద్యం అమ్మకాలకు పేటింట్ తీసుకుని మరి కార్యకర్తలతో విక్రయాలు జరపడం, పేకట శిబిరాలను తెరచి యథేచ్ఛగా క్లబ్ నిర్వహించడం వంటి వింత ఆటవిక పోకడలు అంతకు మించి అని చెప్పకోవాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసులను జేబు రుమాలగా మార్చి చేస్తున్న అక్రమాలు నెవ్వర్ బీఫోర్ .. ఎవర్ ఆఫ్టర్ అన్న మాదిరిగా ఉన్నాయి. వీటికి తోడు తాజా అనంతపురం జిల్లాలో అధికారపార్టీ నాయకుల దొంగ బంగారం దందా వ్యవహారం ఒకటి వెలుగుచూసింది. హిందూపురంలోని వైసీపీ నాయకులు దొంగ బంగారం వ్యాపారం చేస్తున్నారని కర్నాటక పోలీసుల విచారణలో బయటపడి వాస్తవాలు. బెంగళూరులో దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించిన కర్నాటక పోలీసులకు హిందూపురం అధికార పార్టీ నాయకుల లింకులు బయటకొచ్చాయి. దీంతో ముగ్గురు వైసీపీ నేతల ఇళ్లల్లో సోదాలు జరిపిన కర్నాటక పోలీసులు.. వారిని ఆదుపులోకి తీసుకున్నారు. వారిని బెంగళూరు తీసుకెళ్లేందుకు వాహనాల్లో ఎక్కించుకుని పోలీసులకు స్థానిక అధికారపార్టీ నాయకులు వాహనాలను అడ్డుకుని, చుక్కలు చూపించారు. దీంతో లోకల్ పోలీసుల సాయంతో వారిని ఆదుపులోకి తీసుకుని కర్నాటకు తరలించారు
Must Read ;- .నెల్లూరులో అధికారి వింత చర్యలు..! వైసీపీ కండువా కప్పుకున్న ఎంపీడివో..!!










