రౌడీ రాజకీయంతో రాజ్యాంగ విలువలకు విఘాతం!
జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో జరిగే రాజకీయ వింతలు, విడ్డూరాలు గతంలో ఎన్నడూ చూడలేదు. అయితే ఇవి భావి తరాల రాజకీయవేత్తలకు ఏమని దిశనిర్దేశం చేస్తాయో తెలియదు కానీ .. ప్రజస్వామ్య విలువలను ఖచ్చింతంగా దిగజార్చుతోందన్నది వాస్తవం. రాజకీయాల్లో కనీస విలువలు పాటించకపోతే జరిగేది రాజ్యాంగ విఘాతమే. పార్టీల బలాబలాలు తేలాలంటే ప్రజారణ్యంలో పోటీ అనేది పాదదర్శంగా జరగాలి. ప్రజలను ప్రశాంత వాతావరణంలో వారీ ఓటు హక్కును వినియోగించుకోకుండా అలజడి సృష్టిస్తే, అధిక నష్టం అధికారపార్టీకేనని గ్రహించాలి. రాష్ట్రంలో మిని లోకల్ ఎలక్షన్ మొదలైన నాటి నుంచి కుప్పం వార్ జోన్ లోకి వెళ్లింది. ఎక్కడ లేనంతగా పోలీసులు ఆంక్షాలు, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఈసీ ఒంటెద్దు పోకడలు ప్రతిపక్ష టీడీపీ నాయకులను తీవ్ర వెతలకు గురిస్తున్నాయి. ఈ చర్యలు కుప్పం ప్రజలే కాదు .. రాష్ట్రం మొత్తం చూసి నివ్వెరపోతున్నారు. గతంలో ఇంతలా ప్రజాస్వామ్యం అపహస్యం చేసిన చరిత్ర లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో దొంగ ఓట్ల సంస్కృతి!
మొన్న తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు, బద్వేల్ శాసన సభ ఉప ఎన్నికలల్లో అధికారపార్టీ తొక్కిన దొంగ దారులు అన్నీఇన్నీ కావు. పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలను తరలించి మరి దొంగ ఓట్లు కొట్టించేందుకు అధికారపార్టీ నాయకులు వేసిన ఎత్తులను విపక్షాలు గుర్తించి, యాగీ చేసిన ఇంకా సిగ్గు రాలేదనుకుంటా .. సేమ్ సీన్ కుప్పంలో రిపిట్ చేస్తున్నారు. తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించి, దొంగ ఓట్లు గుద్దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనిని ప్రశ్నించిన స్థానిక టీడీపీ దళిత మహిళా నేతను నోటికొచ్చినట్లు తిట్టి దాడికి ప్రయత్నించారు. కుప్పం ప్రాంతంలోనే కాదు .. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో వ్యాప్తంగా దళితులపై, బడుగు బలహీన వర్గాలపై దాడులు జరుగుతునే ఉన్నాయి. నవరత్నాలను వండివారుస్తున్న జగన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో అలజడులు సృష్టించకుండా ఎన్నికల్లో పాల్గొనడం చేతకాదా? అని బాధితులు వాపోతున్నారు. కుప్పంలో ప్రతివార్డులో 150 దొంగ ఓట్లు వేయడానికి అధికారపార్టీ వ్యూహరచన చేసింది. తిరుపతి, బద్వేల్ తరహా బస్సుల్లో కాకుండా కుప్పంకు కారుల్లో తరలిస్తున్నారు. ఎన్నికల్లో అలజడులు సృష్టించడానికి, దొంగ ఓట్లు వేయించడానికి కుప్పంలో ఈ ఐదురోజులకు ఒక్కొ ఇంటికీ రూ.20 వేలు కట్టి అద్దెకు తీసుకున్నారు. కొత్త ముఖాలను గుర్తించిన ప్రజలను భయాందోళనకు గురుచేస్తున్నారు.
ప్రశ్నించే గొంతును నొక్కి .. విపక్షాన్ని తొక్కి!
కుప్పంలో ప్రశ్నించే గొంతుకును నొక్కేస్తున్నారు. చేస్తున్నది అప్రజాస్వామికం అని అడ్డుతగితే ఆంక్షాలు, కేసులంటూ తొక్కేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ పరిథిలో గడిచినవారం రోజుల్లో తెలుగుదేశం తరుఫున కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలపై పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. స్థానికేతరులు వచ్చి డబ్బులు పంచుతున్నారు ఆరోపిస్తే .. పోలీసులతో అడ్డుకుని గృహనిర్భందం చేస్తున్నారు. ఇలా నామినేషన్ ప్రక్రియ ప్రారంభం నాటి నుంచి అనేక సంఘటనలు అధికార పార్టీ దాష్టికానికి అద్దం పట్టాయి. నామినేషన్లు వేయకుండా అడ్డుపడుతునే… మరోపక్క నామినేషన్ వేసిన టీడీపీ నాయకులను ఉపసంహరించుకోవాలని వత్తిడి తీసుకొచ్చారు. ఉపసంహరించుకోవడం లేదని చివరికి ఫోర్జరీ సంతకాల ద్వారా ప్రత్యర్థుల నామినేషన్లను ఉపసంహరించేలా చేసిన ఘనత అధికార వైఎస్సార్సీపీకే దక్కుతోంది. కుప్పం 23వ వార్డులో నాన్ లోకల్ వారు ప్రచారం చేస్తున్నారని అడ్డుకున్న మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్, ఆయన తల్లి పై దాడిచేశారు. దాడికి ప్రతిదాడి సంస్కృతి కాదని, ఎంతో సహనంగా, ఓర్పుగా జరుగుతున్న దురాఘతాలను ఈసీకీ, డీజీపీ ఫిర్యాదు చేస్తూ ముందుకు సాగుతోంది తెలుగుదేశం పార్టీ. ప్రజా తీర్పు అధికార ప్రలోభాలకు గురికాదని గ్రహించే .. దైర్యంగా కుప్పం ఎన్నికలో బరిలో నిలించాయి టీడీపీ శ్రేణులు.
Must Read మాఫియా లీగలైతే .. ఇక నరమేథమే!











