హాలీవుడ్ దిగ్గజం ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ మళ్లీ నటించబోతున్నారా? ఔననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేవలం నెట్ ఫ్లిక్స్ కోసమే ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఆయన అంగీకరించినట్టు సమాచారం. టెర్మినేటర్ లాంటి సినిమాల కాలం నుంచి ఆర్నాల్డ్ సినిమాలకు మంచి క్రేజ్ వచ్చింది. ఆమధ్య రాజకీయ రంగ ప్రవేశం చేసి కాలిఫోర్నియా గవర్నర్ గానూ చేశారు. 1970 నుంచి నటిస్తున్నా సినిమాలను మాత్రం వదిలిపెట్టడం లేదు.
ఆర్నాల్డ్ కు ఇప్పుడు 73 ఏళ్ల వయసుంటుంది. ఆర్నాల్డ్ నటించబోయే స్పై థ్రిల్లర్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ఏ ఓటీటీకి దక్కిందనే విషయం మాత్రం ఇంతవరకు వెల్లడి కాలేదు. అయితే నెట్ ఫ్లిక్స్ తో చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దీని తర్వాత నెట్ ఫ్లిక్స్ సిరీస్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం దీని మీద స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఓ గూఢచారి సాహసాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ ఉంటుందట.
మనకు మరో జేమ్స్ బాండ్ ఆర్నాల్డ్ రూపంలో దొరికాడని అనుకోవాలి. తండ్రి, కుమార్తెలతో ఈ గూఢచారి పాత్ర ఉంటుంది. తండ్రి పాత్రకు ఆర్నాల్డ్ ఎంపికైనా, కుమార్తె పాత్రకు సరిపోయే నటి చాలాకాలం వరకూ దొరకలేదు. తాజాగా ‘టాప్ గన్ మావెరిక్’ నటి మోనికా బార్బరాను ఎంపిక చేశారు. ఈ వెబ్ సిరీస్ కేవలం నెట్ ఫ్లిక్స్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఆర్నాల్డ్ జర్నీ ఎంతకాలం నెట్ ఫ్లిక్స్ తో కొనసాగుతుందో చూడాలి.