కొన్నాళ్ల క్రితం ఏ అమ్మాయినైనా నీకు కాబోయే వరుడు ఎలా ఉండాలి అంటే ప్రభాస్ అని ఠక్కున సమాధానం వచ్చేది. ఆరడుగుల అందగాడు, ఆజానుబాహుడు అయిన ప్రభాస్ ను చూసి మనసు పారేసుకోని వారంటూ ఉండరు. అలాంటి ప్రభాస్ ను రెండ్రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో చూసి జనం కంగుతిన్నారు. మొహం ముదిరిపోయినట్టు కనిపించింది. వయసు పైబడిన రూపంలా ఉంది. అసలు మేకప్ లేకుండా అలా మీడియా ముందుకు రావడం ఎందుకు అంటున్నవారు కూడా ఉన్నారు. అంతకుముందు కారులో ప్రయాణిస్తున్న ఫొటో కూడా అలానే ఉంది.
ప్రభాస్ లుక్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా ఎదిగాడు. బాహుబలి తర్వాత వస్తున్న సినిమాలన్నీ భారీవే. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, వైజయంతీ మూవీస్ చిత్రం.. ఇలా ఏ సినిమా తీసుకున్న భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే. సాధారణంగా హీరోలు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. డార్లింగ్ సినిమా నుంచి ప్రభాస్ వేసుకునే దుస్తుల దగ్గర్నుంచి చాలా జాగ్రత్తలు తీసకున్నాడు. రెండ్రోజుల క్రితం ‘శ్రీదేవి సోడా సెంటర్’ ప్రమోషన్ లో భాగంగా హీరో సుధీర్ కుమార్ కోసం ప్రభాస్ చిట్ చాట్ లో పాల్గొన్నారు.
అది మీడియాకు వదులుతారని తెలిసి కూడా ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదు. లుక్ లోనే కాదు ఆయన మాటల్లోనూ ఏదో లోటు కనిపించింది. తనకు వయసుకు మించి కనిపించారు. ఆ లుక్ చూసి అంకుల్ లా ఉన్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. యాంటీ ప్రభాస్ ఫ్యాన్స్ దీన్ని అవకాశంగా తీసుకున్నారు. ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఎదగడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. స్నేహితుడి కోసం మొహమాటానికి పోయి ప్రభాస్ ఇరుక్కున్నట్టు అనిపించింది. ఇకనైనా తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుంటుంది.











