రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ సీఎస్ జీవో కూడా జారీ చేశారు. అయితే ఇవేమీ పట్టనట్లు జనాలు నిర్లక్ష్యంగా ఉండటంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. మాస్క్ లు ధరించనివాళ్లపై కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఈనెల 5 నుంచి 11 తేదీ వరకు పోలీసుల డ్రైవ్ లో 6,500 మంది పట్టుబడ్డారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 3500 మందిపై కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ లోనే రెండు వేల మందిపై కేసులు నమోదు పోలీసులు. వెయ్యి రూపాయల జరిమానా విధించడంతో పాటు కోర్టులో కూడా హాజరుపరుస్తామంటున్నారు పోలీసులు.
Must Read ;- మాస్క్ మస్ట్, లేదంటే కఠిన చర్యలు : సీపీ అంజనీ కుమార్